Mallampet: నారాయణ ఉమెన్స్ కాలేజీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్
Mallampet: శాంపిల్ సేకరించి నోటీసులు ఇచ్చిన అధికారులు
Mallampet: నారాయణ ఉమెన్స్ కాలేజీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్
Mallampet: నారాయణ ఉమెన్స్ కాలేజీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దుండిగల్ మల్లంపేట బ్రాంచ్‌లో ఘటన చోటుచేసుకుంది. పలువురు విద్యార్ధినిలు అస్వస్థతకు గురయ్యారు. వారిని నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ట్రీట్‌మెంట్ ఇచ్చిన తర్వాత పిల్లను తల్లిదండ్రులను ఇళ్లకు తీసుకెళ్లారు. కాగా.. విషయం తెలుసుకున్న ఫుడ్ ఇన్ స్పెక్టర్ కాలేజీ హాస్టల్ కిచెన్‌లో తనిఖీలు చేపట్టారు. శాంపిల్స్ సేరకరించి.. నోటీసులు జారీ చేశారు. కాగా... రెండు రోజులు క్రితమే ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే.. కాలేజీ హాస్టళ్లకు సప్లై అవుతున్న వాటర్ ట్యాంకర్ వల్లే.. ఫుడ్ పాయిజన్ జరిగినట్టు తెలుస్తుంది. అయితే.. ఘటననను కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.