Hyderabad: ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల్లో ప్రమాదం.. 10 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం

Hyderabad: 10 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం

Update: 2023-06-21 02:07 GMT

Hyderabad: ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల్లో ప్రమాదం.. 10 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం

Hyderabad: హైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ ర్యాంప్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పిల్లర్ టు పిల్లర్ స్లాబ్ చేస్తుండగా ఫ్లైఓవర్ కుప్పకూలింది. గాయపడ్డవారు బిహార్, యూపీ వాసులుగా గుర్తించారు. ఘటనాస్థలాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పరిశీలించారు. ఘటనపై ఉన్నతాధికారులతో దర్యాప్తు జరిపిస్తామన్నారు.

Tags:    

Similar News