HRCను ఆశ్రయించిన హైదరాబాద్‌ వరద బాధితులు!

తమ బస్తీలలో నిలిచిన వర్షం నీటిని తొలగించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను బాధితులు కోరారు. నెల రోజులకు పైగా వరద నీరు ఉండడంతో.. పిల్లలకు, తమకు రోగాలు వస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Update: 2020-11-09 15:18 GMT

మజ్లీస్ బచావో తెహారిక్ పార్టీ ఆధ్వర్యంలో వరద బాధితులు హైదరాబాద్‌లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఇటీవల కురిసిన వర్షంతో మహేశ్వరం నియోజకవర్గం జల్‌పల్లి మున్సిపాలిటీలోని ఉస్మాన్ నగర్, అహ్మద్ నగర్, సైఫ్ కాలనీలలో ఇప్పటికీ నీరు నిలవడంతో.. హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. ఇప్పటికి నీటిలో వెయ్యి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సహయం అందించకుండా, తమ బస్తీలలో నిలిచిన వర్షం నీటిని తొలగించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను బాధితులు కోరారు. నెల రోజులకు పైగా వరద నీరు ఉండడంతో.. పిల్లలకు, తమకు రోగాలు వస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.


Full View


Tags:    

Similar News