Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయానికి వాన ముప్పు
Shamshabad Airport: హైదరాబాద్‌ను దంచికొట్టిన భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (RGIA) విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Shamshabad Airport: హైదరాబాద్‌ను దంచికొట్టిన భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (RGIA) విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు అప్రమత్తమై పలు అంతర్జాతీయ, దేశీయ విమానాలను తాత్కాలికంగా గన్నవరం విమానాశ్రయానికి (విజయవాడ) మళ్లించారు.
గత కొద్ది గంటలుగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఏ మాత్రం అనుకూలించడం లేదు. దట్టంగా కమ్ముకున్న మేఘాలు, భారీ వర్షాల వల్ల విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సిన పలు విమానాలను ఎయిర్‌పోర్ట్ అధికారులు గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. ముఖ్యంగా ముంబై, పూణె, కలకత్తా వంటి నగరాల నుంచి హైదరాబాద్ చేరుకోవాల్సిన విమానాలు గమ్యస్థానానికి చేరుకోలేకపోయాయి.
ప్రతికూల వాతావరణం కారణంగా పైలట్‌లు విమానాలను సురక్షితంగా దించలేని పరిస్థితి ఏర్పడటంతో, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. వాతావరణం సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే విమానాలు తిరిగి శంషాబాద్‌కు చేరుకుంటాయని అధికారులు తెలిపారు.
గన్నవరం విమానాశ్రయంలో దిగిన ప్రయాణికులకు తదుపరి ప్రయాణ ఏర్పాట్లపై సమాచారం ఇవ్వనున్నట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆకస్మిక మళ్లింపు కారణంగా ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగినప్పటికీ, వారి భద్రతకే తాము తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.