Nizamabad: విషాదం.. కుక్క కాటుతో బాలుడు మృతి
Nizamabad: ఐదేళ్ల బాలుడు కిట్టుపై కుక్కల దాడి.. బాలుడికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
Nizamabad: విషాదం.. కుక్క కాటుతో బాలుడు మృతి
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుక్క కాటుతో బాలుడు మృతి చెందిన ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆలూరు మండలం కల్లడిలో ఈ ఘటన జరిగింది. ఐదేళ్ల బాలుడు కిట్టుపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కిట్టును ఆస్పత్రికి తరలించారు. అయితే.. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బాలుడు కిట్టు మృతి చెందాడు. తమ కుమారుడు కల్లెదుటే విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి జీర్ణించుకోలేకపోయిన తల్లిదండ్రులు.. గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. దీంతో.. ఆ చుట్టుపక్కలంతా విషాదఛాయలు అలుముకున్నాయి.