నల్లమల్లలో అగ్ని ప్రమాదం...

ఇటీవల ఆస్ట్రేలియాలో అడవుల్లో ఏవిధంగానైతే కార్చిచ్చు రాజుకుందో ఇప్పుడు అదే విధంగా తెలంగాణ లోని నల్లమల అటవీ ప్రాంతంలో కూడా నాలుగు రోజుల్లో రెండు సార్లు పెద్ద ఎత్తున కార్చిచ్చు రగిలింది.

Update: 2020-02-05 05:47 GMT

ఇటీవల ఆస్ట్రేలియాలో అడవుల్లో ఏవిధంగానైతే కార్చిచ్చు రాజుకుందో ఇప్పుడు అదే విధంగా తెలంగాణ లోని నల్లమల అటవీ ప్రాంతంలో కూడా నాలుగు రోజుల్లో రెండు సార్లు పెద్ద ఎత్తున కార్చిచ్చు రగిలింది. దీంతో చాలా శాతం వరకు అడవి దగ్దం కావడంతో అందులోని జీవరాశులకు కొంత మేర నీడ లేకుండా పోయాయి. ఇకపోతే నాలుగు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు అగ్నిప్రమాదం సంభవించడంతో అటవీ శాఖ అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

పూర్తి వివరాల్లోకెళితే మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ఉరుమండ సమీపంలోని హైదరాబాద్‌-శ్రీశైలం ప్రధాన రహదారి వద్ద దాదాపు 30 హెక్టర్ల వరకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపుగా 5 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కాలిపోయింది. దీంతో స్పందిచిన అటవీ అధికారులు నాగర్ కర్నూల్, అచ్చంపేట నుంచి ఫైర్ సిబ్బంధికి సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, ఫైర్ ఇంజన్ తో మంటలు అంటుకున్న ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అనంతరం అటవీ శాఖ సిబ్బంధి మాట్లాడుతూ శ్రీశైలం వెళ్లే దారిలో ఎవరైనా ధూమ పానం చేసి బీడీ లేదా సిగరెట్ ని అడవిలో పడేయడం వల్ల మంటలు వ్యాపించి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేసారు. ఇప్పటికే అడవిలో అక్కడక్కడా ఫైర్‌ బీట్లు ఏర్పాటు చేశామని మంటలు ఆ బీట్‌ల వద్దకు రాగానే ఆగిపోతాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో వన్యప్రాణులకు ఎలాంటి హాని జరగలేదని వారు తెలిపారు. ఇదే తరహాలో శనివారం కూడా ఈ రేంజ్ పరిధిలోనే మంటలు చెలరేగి దాదాపుగా 16 ఎకరాలకుపైగా అడవి కాలిపోయిందని వారు తెలిపారు. 

Tags:    

Similar News