Adilabad: రైతుకు హ్యాట్సాఫ్‌.. కేవలం రూ. 100తో ఎకరంన్నర పొలం..

Adilabad: బ్రహ్మాంగారు ఎడ్లు లేని బండ్లు వస్తాయని జోస్యం చెప్పారు.

Update: 2021-06-24 11:06 GMT

రైతుకు హ్యాట్సాఫ్‌.. కేవలం రూ. 100తో ఎకరంన్నర పొలం.. 

Adilabad: బ్రహ్మాంగారు ఎడ్లు లేని బండ్లు వస్తాయని జోస్యం చెప్పారు. కానీ ఇప్పుడు ఎడ్లు లేని నాగలి కూడా వచ్చేసింది. రోడ్లపై చక్కర్లు కొట్టే బైక్‌ ఏంచక్క పొలం దున్నేస్తోంది. పైగా చౌకగా చకచక పని కానిచ్చేసింది. అది ఎలాగో మీరే చూడండి.?

ఆదిలాబాద్‌ జిల్లా బజరాత్నూర్‌ మండల కేంద్రంలో మల్లేష్‌ అనే సన్నకారు రైతుకు ఎడ్లు లేవు. పోని కొందామంటే పైసలు లేవు. అద్దెకు ఎద్దులను తెచ్చుకుందామంటే రోజుకు రెండువేలు. భరించలేనంత బారంగా మారింది. ఆ భారాన్ని తప్పించుకోవడానికి ఎద్దులు లేకుండా పొలం దున్నాలనే అలోచన వచ్చింది. ఇంకేముంది తన బైక్‌కు నాగలిని బిగించి రంగంలోకి దిగాడు.

ఒకరు బైక్ నడుపుతుండగా మరోకరు వెనుక నాగలిని పట్టుకున్నారు. ఇలా బైక్‌తో అరవై గుంటల భూమిలో గంటలో పని పూర్తిచేశారు. ఎడ్ల అద్దెకు తెచ్చుకుంటే రెండు వేల ఖర్చు అయ్యేది. ఇప్పుడు వంద రూపాయల పెట్రోల్‌తో అనుకున్న పని పూర్తి అయ్యిందని రైతు అనందం వ్యక్తం చేస్తున్నాడు.

Full View


Tags:    

Similar News