Big Breaking: రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి రైతు రుణమాఫీ అమలు..!
తొలివిడత రూ.19వేల కోట్ల రుణాల మాఫీ
Breaking News: రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి రైతు రుణమాఫీ అమలు..!
Farmers Loan Waiver: తెలంగాణలో రేపటి నుంచి రైతు రుణమాఫీ అమల్లోకి రానుంది. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పున:ప్రారంబించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతగా 19 వేల కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. నెల నుంచి నెలన్నర లోపు ఈ ప్రక్రియను పూర్తిగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సెప్టెంబర్ రెండో వారం వరకు రుణమాఫీ పూర్తిచేయాలని ఆదేశించారు. నోట్ల రద్దు, కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక లోటు.. కేంద్రం FRBM నిధులు ఇవ్వకపోవడంతో ఇన్నాళ్లు ఆలస్యమైందన్న కేసీఆర్.. ఎన్ని కష్టాలు వచ్చినా రైతు సంక్షేమాన్ని విస్మరించమన్నారు. రైతు సాధికారత సాధించేవరకు విశ్రమించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు సీఎం కేసీఆర్.