వరంగల్‌లో నకిలీ అల్లం తయారు ముఠా గుట్టురట్టు.. 20 క్వింటాళ్ల అల్లంపేస్ట్ స్వాధీనం
Warangal: కరీమాబాద్‌లోని 3 కంపెనీల్లో టాస్క్‌ఫోర్స్ దాడులు
వరంగల్‌లో నకిలీ అల్లం తయారు ముఠా గుట్టురట్టు.. 20 క్వింటాళ్ల అల్లంపేస్ట్ స్వాధీనం
Warangal: వరంగల్‌లో నకిలీ అల్లం తయారు చేస్తున్న షాపులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అపరిశుభ్రమైన ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వఉంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వరంగల్ సీపీ ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దుకాణాల్లో వరుస తనిఖీలు చేపడుతున్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా దాడుల్లో పాల్గొన్నారు. కరీమాబాద్‌లోని మూడు కంపెనీల్లో సోదాలు నిర్వహించిన అధికారులు 20 క్వింటాళ్ల అల్లంవెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. కల్తీ అల్లం తయారు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.