Rachakonda: రాచకొండ పరిధిలో నకిలీ సర్టిఫికెట్స్ ముఠా అరెస్ట్

Rachakonda: ఏడుగురు నిందితుల అరెస్ట్

Update: 2023-01-27 05:31 GMT

Rachakonda: రాచకొండ పరిధిలో నకిలీ సర్టిఫికెట్స్ ముఠా అరెస్ట్ 

Rachakonda: రాచకొండ కమిషనరేట్ పరిధిలో కలకలం సృష్టించిన నకిలీ సర్టిఫికెట్స్ ముఠా ఆట కట్టించారు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు . చైతన్యపురి పోలీసులతో కలిసి స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన ఎల్బీనగర్ ఎస్ ఓ టీ టీమ్ ఏడుగురు సభ్యుల ఫేక్ సర్టిఫికెట్స్ ముఠాను పట్టుకుని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు 100 నకిలీ సర్టిఫికేట్ల తో పాటు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

అర్హత లేని వారికి ఫేక్ సర్టిఫికెట్లను అంటగడుతూ, లక్షల్లో పైసలు వసూలు చేస్తున్న ఫేక్ ముఠా ను పట్టుకుని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. ఫేక్ గాళ్ళపై ఫోకస్ పెట్టిన ఎల్బీనగర్ ఎస్ ఓ టీ టీమ్ , చైతన్య పూరి పోలీసులతో కలిసి ఏడుగురు నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశారు. మరో ప్రధాన నిందితుని కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం తప్పించుకుని తిరుగుతున్న వరంగల్ కు చెందిన ఆకుల రవి అలియాస్ అజయ్ గత కొంతకాలంగా అనేక నేరాల్లో నిందితునిగా ఉన్నాడు. కాగా హైదరాబాద్ లో ఓజూనియర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ చింతకాయల వెంకటేశ్వర్లుతో జతకట్టిన ఆకుల రవి ఫేక్ సర్టిఫికెట్స్ కు తెరతీశాడు. రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ వివిధ యూనివర్సిటీలకు చెందిన ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేసి, ఒక్కో సర్టిఫికెట్ ను రెండు నుంచి నాలుగు లక్షల వరకు అమ్మారు. ఇలా చదువులు మధ్యలో ఆపేసిన పలువురికి ఫేక్ సర్టిఫికెట్లను అంటగట్టి వారి వద్దనుంచి సుమారు రెండు కోట్ల రూపాయలు వసూలు చేశారు కేటుగాళ్లు .

ప్రధాన నిందితుడు ఆకుల రవి, చింతకాయల వెంకటేశ్వర్లు చేస్తున్న ఫేక్ సర్టిఫికెట్ల దందాలో రాజేంద్ర నగర్ కు చెందిన జ్యోతి రెడ్డి , వైశాలి లు మీడియేటర్ లగా వ్యవహరించారు. వారిని కూడా అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ఆకుల రవి అలియాస్ అజయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.




Tags:    

Similar News