Jagga Reddy: కంటి చూపు కోల్పోయిన విద్యార్థికి జగ్గరెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సహాయం
Jagga Reddy: మరొసారి తన సేవ గుణాన్ని చాటుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దంపతులు.
Jagga Reddy: కంటి చూపు కోల్పోయిన విద్యార్థికి జగ్గరెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సహాయం
Jagga Reddy: మరొసారి తన సేవ గుణాన్ని చాటుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దంపతులు. కర్ణాటకకు చెందిన కిషన్ పవార్, శాంతాబాయి దంపతులు 15 సంవత్సరాల క్రితం కంది కి వచ్చి స్థిరపడ్డారు. వారి చిన్న కుమారుడు సంపూరన్ నాయక్ ఏడాది క్రితం బైక్ మీద నుంచి కింద పడడంతో తలకు గాయాలయ్యాయి.ఈ ప్రమాదంలో కంటి నుంచి బ్రెయిన్‌కు వెళ్లే నరం వీక్ అవడం వల్ల చూపు కోల్పోయాడు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ కుమారుడికి చికిత్స చేయించలేక అవస్థపడుతున్న తల్లిదండ్రుల గూరించి తెలుసుకున్న జగ్గారెడ్డి 10 లక్షల రూపాయాలు ఆర్థిక సహాయం అందించారు. ఇలాంటి సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దమోదర్ రాజనర్సింహా దృష్టికి తీసుకువెళ్తానని జగ్గరెడ్డి వెల్లడించారు.