Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్‌రావు
Prabhakar Rao: సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు శుక్రవారం (నేడు) సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఎదుట లొంగిపోయారు.
Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్‌రావు
Prabhakar Rao: సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు శుక్రవారం (నేడు) సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారణాధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గురువారం ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు, ప్రభాకర్‌రావును వారం రోజుల పాటు కస్టోడియల్ విచారణకు అనుమతినిచ్చింది.
కోర్టు తన ఆదేశాల్లో ముఖ్యంగా రెండు అంశాలను స్పష్టం చేసింది. ప్రభాకర్‌రావుకు భౌతికంగా ఎలాంటి హాని జరగకుండా చూడాలని దర్యాప్తు అధికారులను ఆదేశించింది. విచారణ అంతా చట్ట ప్రకారం పారదర్శకంగా జరగాలని పేర్కొంది.
వారం రోజుల కస్టడీ విచారణ తర్వాత సమర్పించే నివేదిక ఆధారంగా మళ్లీ విచారణ చేపడతామని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభాకర్‌రావు సిట్ ఎదుట లొంగిపోయారు. ప్రభాకర్‌రావు లొంగిపోవడంతో, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం కానుంది. పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టనున్నారు.