Baba Fasiuddin: బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్
Baba Fasiuddin: కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
Baba Fasiuddin: బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్
Baba Fasiuddin: గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. కేటీఆర్ తీరుపై కొంతకాలంగా బాబా తీవ్ర అసహనంతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ నేతృత్వంలో హస్తం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో తనకు ప్రాణహాని ఉందని చెప్పినా అధిష్టానం పట్టించుకోలేదని తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు.