Huzurabad: ఈటలకు అస్వస్థత.. హైదరాబాద్ కు తరలింపు
Huzurabad: మాజీ మంత్రి ఈటల రాజేందర్ అస్వస్థతకు గురయ్యారు.
Huzurabad: ఈటలకు అస్వస్థత.. హైదరాబాద్ కు తరలింపు
Huzurabad: మాజీ మంత్రి ఈటల రాజేందర్ అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు వీణవంక మండలంలో ప్రజాదీవెన యాత్ర చేస్తుండగా.. ఈటల అనారోగ్యానికి గురయ్యారు. డాక్టర్లు ఈటలకు వైద్యపరీక్షలు చేసి, చికిత్స అందిస్తున్నారు. ఆక్సిజన్, బీపీ స్థాయిలు పడిపోయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈటల ఆరోగ్యం నిలకడగా ఉందని.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈటల అనారోగ్యం పాలవడంతో పాదయాత్ర వాయిదా పడే అవకాశం ఉంది. రాజేందర్ బదులు ఆయన సతీమణి జమున పాదయాత్ర నిర్వహించే అవకాశముంది.