Etela Rajender: సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి ఈటల తీవ్ర విమర్శలు
* నా ఒక్కడిని ఓడించడానికి సవాలక్ష హామీలు: ఈటల * రానున్న రోజుల్లో నన్ను పొడిచేందుకు కత్తి కూడా ఇస్తారు: ఈటల
మాజీ మంత్రి ఈటల రాజేందర్ (ఫోటో: ది హన్స్ ఇండియా)
Etela Rajender: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ముఖ్యమంత్రి ఇచ్చే జీవోలు అన్నీ కుల సంఘాల మీద ప్రేమతో కాదన్నారు. తన ఒక్కడిని ఓడించేందుకు సవాలక్ష హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ఈటల రాజేందర్‌ను పొడిచేందుకు కత్తి కూడా ఇస్తారని సంచలన కామెంట్స్ చేశారు. హుజూరాబాద్‌లో మోకాళ్లు, మోచేతుల మీద నడిచినా తనను ఓడించడం టీఆర్ఎస్ తరం కాదని ఫైర్ అయ్యారు.