Etela Rajender: ప్రశ్నించేవాడిని రక్షించకపోతే మళ్ళీ బానిసత్వమే
* తెలంగాణలో ఆత్మగౌరవం కోసం కోట్లాడుతున్నాం * రాష్ట్ర ప్రజలంతా హుజూరాబాద్ వైపు చూస్తున్నారు - ఈటల
ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)
Etela Rajender: తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవం కోసం కోట్లాడుతున్నామని, కేసీఆర్ అహంకారం గెలుస్తుందా..? ప్రజలు గెలుస్తారా..? అని యావత్ రాష్ట్ర ప్రజానీకం.. హుజూరాబాద్ వైపు చూస్తోందని అన్నారు ఈటల. కేసీఆర్‌తో ఎప్పుడు కోట్లాడినా.. అది ప్రజల కోసమేనని చెప్పారు. ప్రశ్నించే వాడిని రక్షించుకోకపోతే సమాజం బానిసత్వంలోకి జారిపోతుందని అన్నారు ఈటల. తనను ఓడించేందుకు డబ్బులు పంచుతున్నారన్న ఈటల.. హుజూరాబాద్‌కు తన వల్ల పథకాలు వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.