Etela Rajender: రాష్ట్ర ప్రభుత్వమే విధ్వంసం సృష్టించిందనే అనుమానం కలుగుతోంది
Agnipath Protest: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంస ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
Etela Rajender: రాష్ట్ర ప్రభుత్వమే విధ్వంసం సృష్టించిందనే అనుమానం కలుగుతోంది
Agnipath Protest: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంస ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. లేదంటే కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ఆర్మీ పరీక్ష కోసం సిద్దమవుతున్న విద్యార్థి చనిపోవడం దురదృష్టకరమని ఆవేదన చెందారు. నిన్న రాజ్‌భవన్ ముందు కాంగ్రెస్ పార్టీ నేతల హంగామా నేడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం జరగటంలో ఏదో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే యువకులను అడ్డం పెట్టుకుని విధ్వంసం సృష్టించిందనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రధాని మోడీని ఎదుర్కోలేకే ఇలాంటి నీచమైన కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో పలుకుబడి కోల్పోయిన పార్టీలు ఇలాంటి పనులకు పూనుకుంటున్నాయని విమర్శించారు.