Etela Rajender: రేపటి నుంచి ఈటల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర
* ఉదయం 7.30 బత్తినపల్లి హనుమాన్ ఆలయం నుంచి పాదయాత్ర * ఆత్మగౌరవ ప్రస్థానానికి ఇదే తొలి అడుగని ఈటల ట్వీట్
ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)
Etela Rajender: రేపటి నుంచీ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు ఈటల రాజేందర్ ప్రకటించారు. 28రోజుల సుదీర్ఘ ప్రజా దీవెన యాత్రకు అందరి దీవెనలూ కావాలని ట్వీట్ చేశారు. ఉదయం 7గంటల 30నిమిషాలకు కమలాపూర్ మండలం బత్తినవానిపల్లి హనుమాన్ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. తన అనుడుగలకు ప్రజల అండదండలు కావాలన్న ఈటల.. ఆత్మగౌరవ ప్రస్థానానికి ఇదే తొలి అడుగని పేర్కొన్నారు.