విద్యార్థులకు వ్యాసరచన,ఉపన్యాస పోటీలు - డిఇఓ

జిల్లా కలెక్టర్ ఇ. శ్రీధర్ సూచనల మేరకు జనవరి 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని, నాగర్ కర్నూల్ లో వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2020-01-10 13:28 GMT

నాగర్ కర్నూల్: జిల్లా కలెక్టర్ ఇ. శ్రీధర్ సూచనల మేరకు జనవరి 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని, నాగర్ కర్నూల్ జిల్లాయందలి అన్నిరకాల యాజమాన్య పాఠశాలల తొమ్మిదవ మరియు పదవ తరగతి విద్యార్థులకు, తాలూకా స్థాయిలో మరియు జిల్లాస్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వల్ల కలిగే ప్రయోజనాలపై వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు ఒక ప్రకటనలో తెలిపారు.

తాలూకా స్థాయి ఉపన్యాస మరియు వ్యాసరచన పోటీల అంశము, ప్రజాస్వామ్యము-భారతదేశం ఒక ఆదర్శ ప్రాయంజిల్లాస్థాయి ఉపన్యాసం మరియు వ్యాసరచన పోటీల అంశము, ఎన్నికల ప్రక్రియలో గుణాత్మకమైన మార్పులు తాలూకా స్థాయి జనవరి 18వ తేదీన మరియు జిల్లాస్థాయి జనవరి 21వ తేదీన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నాగర్ కర్నూల్ నందు నిర్వహించనున్నామని పోటీలో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బహుమతులు ప్రధానం చేయనున్నట్లు డీఈవో గోవిందరాజులు ఒక ప్రకటనలో ఇతర వివరాలకు జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి 9989821105 ని సంప్రదించాలని కోరారు.

Tags:    

Similar News