South Africa: దక్షిణాఫ్రికాలోని ఓ గనిలో కూలిన ఎలివేటర్‌.. 11 మంది మృతి, 75 మందికి గాయాలు

South Africa: క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన స్థానికులు

Update: 2023-11-29 01:58 GMT

South Africa: దక్షిణాఫ్రికాలోని ఓ గనిలో కూలిన ఎలివేటర్‌.. 11 మంది మృతి, 75 మందికి గాయాలు

South Africa: దక్షిణాఫ్రికాలోని ఓ గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 75 మంది గాయపడ్డారు. రస్టెన్‌బర్గ్‌లోని ఇంప్లాట్స్‌ అనే సంస్థకు చెందిన ప్లాటినం ఉత్పత్తి చేసే గనిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గనిలో విధులు ముగించుకున్న 86 మంది కార్మికులు... గని లోపలి నుంచి ఎలివేటర్‌ ద్వారా పైకి వస్తున్నారు. వారిని పైకి తీసుకొస్తున్న ఎలివేటర్ 656 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎలివేటర్‌లో ఉన్న వారిలో 11 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన వారిని బయటకు తీసుకొచ్చారు. ఎలివేటర్‌ కూలిపోవడానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. 

Tags:    

Similar News