Edupayala: ఏడుపాయల వద్ద తగ్గని మంజీరా ఉద్ధృతి.. జలదిగ్బంధంలోనే వనదుర్గమ్మ

Edupayala: ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి ఏడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

Update: 2025-09-03 07:23 GMT

Edupayala: ఏడుపాయల వద్ద తగ్గని మంజీరా ఉద్ధృతి.. జలదిగ్బంధంలోనే వనదుర్గమ్మ

Edupayala: ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి ఏడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో దుర్గామాత ఆలయం ముందు నుంచి పెద్ద ఎత్తున మంజీరా నది ప్రవహిస్తుంది. 20 రోజులుగా ఏడుపాయల వనదుర్గమ్మ జలదిగ్బంధంలోనే ఉంది. భక్తుల భద్రత దృష్ట్యా రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి దర్శనం కల్పిస్తున్నారు.

గుడి ముందు ఉన్న మూడు పాయలు కలిసి ఒకే పాయగా.. గుడి వెనుక ఉన్న నాలుగు పాయలు అన్నీ కలిసి ఒకే పాయగా మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆలయం వైపు పెద్ద ఎత్తున మంజీరా పరవళ్లు తొక్కుతుండటంతో అటువైపు ఎవరు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

Tags:    

Similar News