IAS Officer: ఐఏఎస్ అమోయ్‌కుమార్ వ్యవహారంలో కీలక మలుపు
IAS Officer: ఐఏఎస్ అమోయ్‌కుమార్ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. నాగారం ల్యాండ్ కేసు వ్యవహారంలో పోలీసుల నుంచి సమాచారం సేకరించింది ఈడీ.
IAS Officer: ఐఏఎస్ అమోయ్‌కుమార్ వ్యవహారంలో కీలక మలుపు
IAS Officer: ఐఏఎస్ అమోయ్‌కుమార్ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. నాగారం ల్యాండ్ కేసు వ్యవహారంలో పోలీసుల నుంచి సమాచారం సేకరించింది ఈడీ. అమోయ్‌కుమార్‌పై వచ్చిన 12 ఫిర్యాదులపై తెలంగాణ డీజీపీ నుంచి వివరాలు సేకరించింది. భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో పోలీసులకు ఈడీ లేఖ రాయడంతో నాగారంతో పాటు పలు కేసులకు సంబంధించిన వివరాలను తెలంగాణ పోలీస్ శాఖ.. ఈడీకి అందజేసింది.
అలాగే.. అమోయ్‌కుమార్‌తో పాటు మరో నలుగురు ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వివరాలను కూడా తెలంగాణ పోలీస్ శాఖ ఈడీ దృష్టికి తీసుకెళ్లింది. శంకరాహిల్స్ సొసైటీ, బాలసాయిబాబా ట్రస్ట్, నాగారం, రాయదుర్గంలోని కొన్ని భూముల వివరాలు ఈడీకి అందడంతో కేసు విచారణ వేగవంతం కానుంది.