ED Raids: కార్వీ కార్యాలయంలో ఈడీ సోదాలు

ED Raids: హైదరాబాద్‌లో కార్వీ కార్యాలయాలు, పార్థసారధి రాజీవ్ రంజన్, కృష్ణ ఇళ్లలో ఈడీ సోదాలు

Update: 2021-09-22 07:05 GMT
కార్వీ ఆఫీస్ లో ఈడీ అధికారులు సోదాలు (ఫైల్ ఇమేజ్)

ED Raids: కార్వీ కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో కార్వీ కార్యాలయాలు, పార్థసారధి, రాజీవ్ రంజన్, కృష్ణ ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తోంది. డీ మ్యాట్ అకౌంట్‌ల నుండి షేర్‌లను బదలాయించుకొని 350 కోట్ల రూపాయల బ్యాంక్‌ రుణాలు పొందింది కార్వీ యాజమాన్యం. బ్యాంక్‌ల నుండి తీసుకున్న రుణాలను వ్యక్తిగత ఖాతాలకు బదలాయించింది. ఇక మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు కార్వీపై అభియోగాలు ఉన్నాయి.

తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో కార్వీపై కేసులు నమోదయ్యాయి. నిధుల గోల్‌మాల్, కస్టమర్ల నగదు స్వాహా చేసినట్లు కార్వీపై ఆరోపణలు విన్పిస్తున్నాయి. అయితే ఇప్పటికే పార్థసారధితో పాటు సీఈవో రాజీవ్ రంజన్, సీఎఫ్‌వో కృష్ణహరిలను అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్‌పై నిందితులను విచారిస్తున్నారు బెంగళూరు క్రైమ్ పోలీసులు.

Full View


Tags:    

Similar News