టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్‌.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..

Nama Nageswara Rao: టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాకిచ్చింది.

Update: 2022-07-02 12:57 GMT

టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్‌.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..

Nama Nageswara Rao: టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాకిచ్చింది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే కేసులో 96 కోట్ల 21 లక్షల విలువైన మధుకాన్‌ గ్రూప్‌ కంపెనీల ఆస్తులను జప్తు చేసింది. ఈ కంపెనీలన్నీ నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధీనంలో ఉన్నట్టు ఈడీ గుర్తించింది.

రాంచీ-జంషెడ్‌పూర్‌ హైవే పేరిట బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న మధుకాన్‌ గ్రూప్‌ కంపెనీలు 10 కోట్ల 30 లక్షల రుణాలు దారి మళ్లించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఆరు డొల్ల కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు జరిగిందని ఈడీ గుర్తించింది. దీంతో హైదరాబాద్‌, బెంగాల్‌, విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 88 కోట్ల 85 లక్షల విలువైన భూములు, మధుకాన్‌ షేర్లు సహా 7 కోట్ల 36 లక్షల చరాస్తులను అటాచ్‌ చేసింది ఈడీ.

Full View


Tags:    

Similar News