Duvvada Madhuri Srinivas: మరో వివాదంలో దువ్వాడ మాధురి
Duvvada Madhuri Srinivas: దువ్వాడ మాధురి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
Duvvada Madhuri Srinivas: మరో వివాదంలో దువ్వాడ మాధురి
Duvvada Madhuri Srinivas: దువ్వాడ మాధురి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ పరిధిలోని ఓ ఫామ్ హౌస్‌లో అనుమతి లేకుండా నిర్వహించిన ఆమె బర్త్‌డే వేడుకల్లో మద్యం పార్టీ నిర్వహిస్తుండగా, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
సమాచారం అందుకున్న SOT పోలీసులు మొయినాబాద్‌లో ఉన్న ఫామ్ హౌస్‌పై దాడులు చేయగా, అక్కడ అక్రమంగా మద్యం పార్టీ జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో 10 మద్యం బాటిళ్లతో పాటు పలు హుక్కాపాట్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ పార్టీలో మొత్తం 27 మంది పాల్గొన్నారు. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించడం, అక్రమంగా మద్యం సేవించడం వంటి అంశాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు, హుక్కాపాట్స్‌తో పాటు నిందితులను మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు.
గతంలో కూడా పలు వివాదాల్లో చిక్కుకున్న దువ్వాడ మాధురి, తాజాగా తన పుట్టినరోజు వేడుక సందర్భంగా అనుమతి లేని మద్యం పార్టీ నిర్వహించి మరోసారి వార్తల్లోకెక్కారు. ఈ ఘటనపై మొయినాబాద్ పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.