Dubbaka results 2020: ఐపీఎల్‌ మ్యాచ్‌ను తలపిస్తున్న దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌

దుబ్బాక ఓట్ల లెక్కింపు క్షణ క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. రౌండ్ రౌండ్ కూ మారుతూ లీడ్ మారుతూ వస్తోంది. బీజీపీ తో టీఆర్ఎస్ తీవ్రంగా తలబడుతున్నట్టు కనిపిస్తోంది.

Update: 2020-11-10 07:48 GMT

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ఐపీఎల్‌ మ్యాచ్‌ను తలపిస్తున్నాయి. రౌండ్ రౌండ్‌కి ఓట్లు లెక్కింపులో ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఏ రౌండ్‌లో ఎవరు ఆధిక్యంలోకి వస్తున్నారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య కొనసాగుతుంది. తొలి ఐదు రౌండ్లలలోనూ బీజేపీ తిరుగులేని ఆధిక్యతను చూపించినా.. ఆరో రౌండ్ వచ్చే సరికి సీన్ మారింది. అనూహ్యంగా టీఆర్ఎస్ లీడ్‌లోకి వచ్చింది. ఆరు, ఏడు రౌండ్‌లలో మాత్రమే టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యతను కనబరిచింది.

ఆ తర్వాత మళ్లీ ఎనిమిదో రౌండ్ వచ్చే సరికి మళ్లీ సీన్ మారింది. పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ఆధిక్యతను కనబరిచినా.. ఫలితం లేకుండా పోయింది.. ఓవరాల్‌గా ఏనిమిదో రౌండ్‌లో బీజేపీ లీడ్‌లోకి వచ్చింది. ఇక తొమ్మిదో రౌండ్ కి వచ్చేసరికి బీజేపీ భారీ లీడ్‌ సాధించింది. మళ్లీ పదో రౌండ్‌ వచ్చేసరికి టీఆర్ఎస్ అధిక్యంలోకి వచ్చింది. ఓవరాల్‌గా 3వేల 734 ఓట్ల మెజారిటితో బీజేపీ హవా కొనసాగిస్తోంది.  

మొత్తం 23 రౌండ్లు ఉండగా.. ఇప్పటి వరకు 10 రౌండ్లు పూర్తయ్యాయి.. కీలకంగా ఉన్న కొన్ని మండలాల్లో ఇంకా ఓట్లు లెక్కించాల్సి ఉంది. మిగతా 14 రౌండ్లలో ఎవరు గెలుస్తారు.. దుబ్బాక గడ్డపై ఎవరి జెండా ఎగరనుందని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రౌండ్ రౌండ్‌కి సీన్ మారుతుండడంతో.. గెలుపు ధీమాలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలున్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ఉప ఎన్నికల్లో తన ప్రభావం చూపించలేక పోయింది. కనీసం డిపాజిట్‌లు కూడా రాబట్టలేకపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే మూడో స్థానంలో కొనసాగుతోంది. 

Tags:    

Similar News