దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌: ఐదో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం

Update: 2020-11-10 05:39 GMT

Dubakka Elections 2020 Results Updates : దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బీజేపీ అధిక్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫలితాలు వెలువడిన ఐదో రౌండ్లలోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. దుబ్బాక ఉప ఎన్నిక ఐదో రౌండ్‌ కౌంటింగ్‌లో బీజేపీ 3,462 ఓట్లు సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థికి 3,126 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్‌లో బీజేపీకి 336 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ 16,517 ఓట్లు, టీఆర్ఎస్ 13,497 ఓట్లూ సాధించాయి.

దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ నెల 3న పోలింగ్‌ జరగ్గా మంగళవారం ఓట్ల లెక్కింపు కోసం సిద్దిపేట సమీపంలోని పొన్నాల ఇందూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో అధికారులు ఏర్పాట్లు చేశారు. 315 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో ఉప ఎన్నిక జరిగింది. మొత్తం 23 మంది పోటీ చేశారు. మొత్తం రెండు గదుల్లో ఒక్కో గదిలో 7 టేబుల్స్‌ చొప్పున 14 టేబుల్స్‌ వేశారు. 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఫలితం వెలువడనుంది.

Tags:    

Similar News