బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. దవడ నొప్పికి వెళ్తే.. ఉన్నది పీకేశారు!
కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. పంటి నొప్పితో బాధపడుతున్న రజాక్ అనే వ్యక్తి బాన్సువాడ ఏరియా ప్రభుత్వం ఆస్పత్రి వెళ్లాడు. అక్కడ డాక్టర్ దేవిసింగ్... పేషెంట్‌కు మత్తుమందు ఇచ్చి... నొప్పి ఉన్న పన్ను కాకుండా... మరో పన్నును పీకేశారు.
మత్తు దిగిన తర్వాత నొప్పి అలాగే ఉందని మరోసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే... మరో పన్ను పీకేసినట్టు తెలిసిందని బాధితుడు వాపోయారు. తన కుటుంబసభ్యులతో కలిసి సూపరిండెంట్ విజయలక్ష్మికి ఫిర్యాదు చేశారు.