DK Aruna: కేంద్రరైల్వేశాఖ సహాయమంత్రితో ఎంపీ డీకే అరుణ భేటీ
DK Aruna: మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సోమన్నను కలిశారు.
DK Aruna: మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సోమన్నను కలిశారు. పాలమూరు పార్లమెంట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై మహాబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి కేంద్ర మంత్రికి ప్రతిపాదనలు ఇచ్చారు. మహబూబ్ నగర్‌లోని తిరుమలదేవుని గుట్ట వద్ద ROB నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని విన్నవించారు. ROB నిర్మాణం, అవశ్యకత, జిల్లా ప్రజలకు ఉపయోగం, ప్రయోజనాలను కేంద్ర మంత్రికి ఎంపీ డీకే అరుణ వివరించారు. ఇందుకు కేంద్రరైల్వేశాఖ సహాయమంత్రి సోమన్న సానుకూలంగా స్పందించారు.