కంటైన్మెంట్ క్లస్టర్ లలో పనిచేసిన వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి: కలెక్టర్
కంటైన్మెంట్ క్లస్టర్లలో పనిచేస్తున్న వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు
నిజామాబాద్: కంటైన్మెంట్ క్లస్టర్లలో పనిచేస్తున్న వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో అర్సపల్లి పురుషోత్తం గుప్తా ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో కరోనా వైరస్ కంటైన్మెంట్ క్లస్టర్ లలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి , హెల్త్ డిపార్ట్మెంట్ ఆశ వర్కర్లకు, రెవెన్యూ సిబ్బందికి మీడియా మిత్రులకు 1600 వందల మందికి పంపిణీ చేయుటకు ఏర్పాటు చేస్తున్న గిఫ్ట్ లను సిద్ధం చేస్తున్న ఈ ఫంక్షన్ హాల్ ను సి పి కార్తికేయ, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం టౌన్ లో 12 క్లస్టర్ల లో వీరు రోజు క్లస్టర్ల లో ఇంటింటికి తిరిగి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చాలా కష్టపడి పనిచేస్తున్నారని, వారికి మధ్యాహ్న భోజనం ఇబ్బంది కాకుండా వారి దగ్గరికి పంపించే విధంగా స్థానిక ఎమ్మెల్యే ముందుకు రావడం, భోజనాలు అందచేయడం అభినందనీయమన్నారు.
జిల్లాలో కరోనా వైరస్ కేసులు 61 పాజిటివ్ రావడం జరిగిందని మిగతావి నెగిటివ్ వచ్చావని ఇంకా 80 శాంపిల్స్ కు రిపోర్టు రావలసి ఉందని తెలిపారు. జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదని కరోనా 28 రోజుల వరకు కూడా బయటపడే అవకాశం ఉంటుందని అందుకని రాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్ పీరియడ్ 28 రోజులు చివరి పెంచిందని అందువల్ల 28 రోజులు పూర్తయ్యేంతవరకు ఎవరు బయటకు రావద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నుడాచైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మేయర్ నీతూ కిరణ్, ఆర్డీవో వెంకటయ్య, ఏసిపి రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.