KTR Vs Rajasingh: రజాకార్ సినిమాపై బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య వివాదం
KTR Vs Rajasingh: కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చిన రాజాసింగ్
KTR Vs Rajasingh: రజాకార్ సినిమాపై బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య వివాదం
KTR Vs Rajasingh: తెలంగాణ రాజకీయాలలో రజాకార్ సినిమా టీజర్ పొలిటికల్ కాంట్రవర్సీకి వేదికగా మారుతోంది. ఈ సినిమాపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందించారు. కొంత మంది బీజేపీ నేతలు తెలంగాణలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డుతో పాటు తెలంగాణ పోలీసుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళతామన్నారు. దీనికి ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కలిసి సినిమా చూద్దాం రండి అంటూ కేసీఆర్‌ని ఆహ్వానించారు. ఇటీవలే రజాకార్ సినిమా విడుదలైంది.