TS News: డీజిల్ ట్యాంకర్ బోల్తా.. ఎగబడ్డ జనం..
TS News: దమ్మపేట మండలం ముష్టిబండ జాతీయ రహదారిపై ఘటన
TS News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీజిల్ ట్యాంకర్ బోల్తా
Dammapeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. రోడ్డుపక్కన పంట కాలవలోకి డీజిల్ కారిపోవడాన్ని గమనించిన స్థానికులు బకెట్లు, డబ్బాలతో పట్టుకుని వెళ్లారు. దమ్మపేట మండలం ముష్టిబండ జాతీయ రహదారిపై డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ నుంచి డీజిల్ కారిపోవడాన్ని స్థానికులు గమనించి బకెట్లు, డబ్బాలు పట్టుకుని క్యూ కట్టారు. గుంపుగుంపులుగా తరలివచ్చిన జనం ఆ డీజిల్‌ను పట్టుకునేందుకు పోటీ పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు జనాలను అడ్డుకున్నారు. అగ్నిప్రమాదం పొంచిఉందని హెచ్చరించి జనాలను దగ్గరకు రాకుండా నిరోధించారు.