Telangana: అసెంబ్లీ వైపు చూస్తున్న ఆ ఇద్దరు బీజేపీ ముఖ్యనేతలు.. సీఎం అభ్యర్థి తామేనని..

Telangana: తెలంగాణలో రాజకీయాల్లో రోజుకో కొత్త అంశం వెలుగుచూస్తోంది.

Update: 2022-05-24 08:56 GMT

Telangana: అసెంబ్లీ వైపు చూస్తున్న ఆ ఇద్దరు బీజేపీ ముఖ్యనేతలు.. భవిష్యత్ సీఎం అభ్యర్థి తామేనని.. 

Telangana: తెలంగాణలో రాజకీయాల్లో రోజుకో కొత్త అంశం వెలుగుచూస్తోంది. ఎన్నికలకు ఏడాదిన్నర మాత్రమే ఉండటంతో చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అలాంటి వారిలో ముఖ్యులు బీజేపీ చీఫ్ బండి సంజయ్. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఇప్పటికే అసెంబ్లీ సెగ్మెంట్లలో పనులు సైతం ప్రారంభించినట్టు తెలుస్తోంది.

బీజేపీ చీఫ్ బండి సంజయ్ దృష్టి ఆ రెండు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారంటున్నారు పార్టీ నేతలు. వేములవాడ వర్కౌటైతే ఓకే లేదంటే ఎల్బీ‌నగర్ నుంచి బరిలో దిగేందుకు బండి సిద్ధమవుతున్నారట. ఇప్పటికే రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకున్న సంజయ్ అందుకు కార్యకర్తలను సైతం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు మరో ఫైర్ బ్రాండ్ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు తహతహలాడుతున్నారు. ఆర్మూరు నుంచి బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు సైతం చేసుకుంటున్నారు.

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల మధ్య గ్యాప్‌ రావడంతో నేతలు కొత్త ఆలోచన చేస్తున్నారు. తెలంగాణలో కమలం పార్టీకి అధికారంలోకి రావడం ఖాయమని నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎంపీ పదవి కంటే ఎమ్మెల్యే పదవే ముద్దని భావిస్తున్నారు. రాష్ట్ర బీజేపీలో గట్టి పట్టున్న నేతగా గుర్తింపు పొందిన ఇద్దరు నేతలు ఎమ్మెల్యేగా గెలిచి భవిష్యత్ సీఎం అభ్యర్థి తామేనని అన్పించుకోవాలన్న ఆలోచనలో కూడా ఉన్నారట. బీజేపీ జాతీయ నేతలకు సైతం దీనికి సంబంధించి సమాచారం అందించారట. ఇద్దరు నేతల వ్యూహాలపై అటు సంఘ్‌లోనూ ఇటు పార్టీలోనూ జోరుగా చర్చ సాగుతోంది. 

Tags:    

Similar News