రామాలయంలో వైభవంగా ధనుర్మాస పూజలు

జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో గల శ్రీ సీతారామ స్వామి దేవాలయంలో 50వ వార్షిక ప్రత్యేక ధనుర్మాస పూజలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి కందాడై వరదరాజన్ తెలిపారు.

Update: 2019-12-20 04:46 GMT

నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో గల శ్రీ సీతారామ స్వామి దేవాలయంలో 50వ వార్షిక ప్రత్యేక ధనుర్మాస పూజలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి కందాడై వరదరాజన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు తెల్లవారుజామున ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన సేవ, సామూహిక అభిషేక అర్చనలు, తిరుప్పావై, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

అనంతరం ధనుర్మాస పూజా విశిష్టతను తెలిపారు. అనంతరం భక్తులందరికీ స్వామివారికి నివేదించిన ప్రత్యేక ప్రసాదాలను పూజారులు ప్రసాద వితరణ చేశారు. సత్యసాయి భక్తులచే సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిత్య విష్ణు సహస్ర పారాయణ కమిటీ సభ్యులు, పూజారులు గోమఠం మురళీ మోహన్ ఆచార్యులు, శ్రీనివాసాచార్యులు, అజయ్ కుమార్ ఆచార్యులు, కన్నడ శ్రీనివాస చార్యులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News