GHMC Theme Parks: గ్రేటర్ పరిధిలో 50 థీమ్ పార్కులు

GHMC Theme Parks: గ్రేటర్ పరిధిలో 50 థీమ్ పార్కులు అభివృద్ధి చేయాలని నిర్ణయించామని జీహెచ్ ఎంసీ అధికారులు తెలిపారు.

Update: 2021-03-13 12:16 GMT

ఇమేజ్ సోర్స్: (ది హన్స్ ఇండియా)

GHMC Theme Parks: కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు వెళ్లే పార్కుల్లో అంతకుమించిన సదుపాయాలు కల్పించాలని జీహెచ్ఎంసీ (GHMC) నిర్ణయించింది. పనిచేసుకునేందుకు అనువైన ఉద్యానవనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఉప్పల్ చౌరస్తాలోని సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన దాదాపు ఎకరం విస్తీర్ణంలోని స్థలంలో అధునాతన ఉద్యానవనం రూపుదిద్దుకుంటోంది. సమీపంలో ఐటీ సంస్థలున్న నేపథ్యంలో టెకీలతో పాటు ఇతర వర్గాలకు ఉపయోగకరంగా ఉండేలా పార్కులో వసతులు కల్పిస్తున్నారు. ప్రహారీగోడతో పాటు పాత్ వేలు ..కుర్చీలు ఏర్పాటుచేస్తున్నారు. దాదాపు కోటీ ఇరవై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులు దాదాపు తుది దశకు చేరాయని అధికారులు చెప్తున్నారు.

కాలానికి అనుగుణంగా సాంకేతిక హంగులతో...

పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఆటపరికరాలు..భిన్న ఆకారాల్లో ఉన్న ఉడెన్ ర్యాంపులు ఏర్పాటుచేస్తున్నారు. ఆంగ్ల అక్షరాలు నెంబర్లు నేర్చుకునే ఆసక్తి పిల్లల్లో కలిగేలా మనిషి ఆకారంలో ఉన్న బొమ్మలు పార్కులో ఉండనున్నాయి. అధికారులు..ఐటీ హంగులతో పార్కులో పలు వసతులు కల్పిస్తన్నట్టు చెప్పారు. పిల్లలతో పాటు పార్కులకు వచ్చే తల్లితండ్రులు అత్యవసర పనులుంటే ల్యాప్టాప్ లో అక్కడే చేసుకునేలా సీటింగ్ ఏర్పాటుచేస్తున్నారు.భూగర్విద్యుత్ కేబుల్ ద్వారా ల్యాప్ టాప్ పవర్ ప్లగ్ పెట్టేలా సాకెట్ లు అమర్చనున్నారు. వెన్ను నొప్పి వంటి ఇబ్బందులు లేకుండా సీటింగ్ ఉండనుంది. వీటితో పాటు ల్యాండ్ స్కేపింగ్ తో పాటు పార్కుకు పచ్చందాలు అద్దనున్నారు. హృదయాకారం ...పడవ ఆకారంలో ఉండే ఉడ్ వంటి సెల్పీ స్పాట్ లూ పార్కులో సిద్ధమవుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక హంగులకు దగ్గరగా పార్కు అభివృద్ధి చేస్తున్నారు.

సాధారణ పార్కులకు భిన్నంగా...

సాధారణ పార్కులకు భిన్నంగా ఈ పార్కును తీర్చిదిద్దుతున్నామని చెప్తున్నారు. గ్రేటర్ లో 50 థీమ్ పార్కులు అభివృద్ధి చేయాలని నిర్ణయించామని..ఇందులో భాగంగానే ఉప్పల్ లో స్మార్ట్ పార్కు అందుబాటులోకి తీసుకువస్తున్నామంటున్నారు అదికారులు.

Tags:    

Similar News