Dasoju Sravan: మాఫియాను నడిపినట్లు పార్టీని రేవంత్ నడుపుతున్నారు.. అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా..
Dasoju Sravan: 2014 నుంచి పార్టీ కోసం అహోరాత్రులు కష్టపడి పనిచేశానని ఆవేదన వ్యక్తం చేశారు దాసోజు శ్రవణ్.
Dasoju Sravan: మాఫియాను నడిపినట్లు పార్టీని రేవంత్ నడుపుతున్నారు.. అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా..
Dasoju Sravan: 2014 నుంచి పార్టీ కోసం అహోరాత్రులు కష్టపడి పనిచేశానని ఆవేదన వ్యక్తం చేశారు దాసోజు శ్రవణ్. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తరువాత రాజకీయం అంటే కులం, ధనం అన్నట్లుగా మారిందన్నారు. రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అరాచకత్వం పెరిగిపోయిందని సిద్ధాంతాలను తుంగలోతొక్కి పనిచేస్తున్నారని విమర్శించారు. బానిస బతుకు బతకడం ఇష్టంలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు దాసోజు శ్రవణ్ ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్‌ను పూర్తిస్థాయిలో భ్రష్టుపట్టించారన్న దాసోజు సర్వేల పేరుతో తప్పుడు నివేదికలు ఇస్తున్నారన్నారు. తన వర్గం నేతలను బలమైన నాయకులుగా చిత్రీకరిస్తున్నారని మాఫియాను నడిపినట్లు పార్టీని రేవంత్‌రెడ్డి నడుపుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు దాసోజు శ్రవణ్.