Damodara Rajanarsimha: గత ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు
Damodara Rajanarsimha: ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి.. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలి
Damodara Rajanarsimha: గత ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు
Damodara Rajanarsimha: గత ప్రభుత్వం పుష్కరాల సందర్భంగా ఆలయాల అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మాట తప్పారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అలంపూర్ చౌరస్తాలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 100 పడకల ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
అలంపూర్‌లోని ఐదో శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించి అమ్మ వారికి, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ఆయన ఆకాంక్షించారు.