Cyclone Montha: మొంథా ఎఫెక్ట్‌తో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు

Cyclone Montha: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2025-10-29 06:00 GMT

Cyclone Montha: మొంథా ఎఫెక్ట్‌తో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు 

Cyclone Montha: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌‌లోని గచ్చిబౌలి, ఖాజాగూడ, నానక్‌రామ్‌గూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, గాంధీ నగర్, కవాడిగూడ, భోలక్‌పూర్, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, బర్కత్‌పురా, బీఎన్‌ రెడ్డి నగర్, మీర్‌పేట్, బాలాపూర్, బడంగ్‌పేట్, మహేశ్వరం, తుక్కుగూడ, పహాడీ షరీఫ్ , జవహర్ నగర్‌, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, దోమలగూడలో వర్షం కురుస్తోంది. వానలతో రహదారులపైకి నీరు చేరింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్ అయింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

ఇటు నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతలలో అత్యధికంగా 20.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఆమ్రాబాద్‌లో 19.7 సెంటిమీటర్లు, నల్గొండ జిల్లా తెల్దేవరపల్లి 18.5 సెంటిమీటర్లు, నాగర్‌కర్నూలు జిల్లా వెల్టూర్‌లో 18.3 సెంటిమీటర్లు, ఐనోలులో 17.8 సెంటిమీటర్లు నల్గొండ జిల్లా ఎర్రారంలో 15, పోలేపల్లిలో 13, రంగారెడ్డి జిల్లా వెలిజాలలో 13.9 , వనపర్తి జిల్లా రేపల్లెల్లో 12, మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో 11.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

తుఫాన్ ఎఫెక్ట్‌తో ఇవాళ ఆదిలాబాద్ , నిర్మల్ , జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కుమురం భీమ్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ , జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌, నల్గొండ, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Tags:    

Similar News