Cyber Fraud: హైదరాబాద్‌లో రోజురోజుకు రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

Cyber Fraud: టెలిగ్రామ్ యాప్ యూజర్లకు యువతుల ఎర

Update: 2023-02-28 06:16 GMT

Cyber Fraud: హైదరాబాద్‌లో రోజురోజుకు రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

Hyderabad: రోజురోజుకు సైబర్ మోసగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. సైబర్ పోలీసులు ఎంత నిఘా పెట్టినా సైబర్ నేరగాళ్లు నయా రూట్‌ వెతుక్కుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ట్రాప్ చేసి ఏకంగా 8 లక్షల రూపాయలు కాజేశారు. టెలిగ్రామ్ యాప్ యూజర్లకు యువతులను ఎరవేసి కోట్లకు కోట్లు ఎగరేసుకుపోతున్నారు సైబర్ నేరగాళ్లు. గడిచిన వారం రోజుల్లో రెండున్నర కోట్లకుపైగా ఛీటర్స్ దండుకున్నారు. సైబర్ కేటాగాళ్ల చేతిలో హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు బాధితులు పెద్దమొత్తంలో మోసపోయారు. యూట్యూబ్ వీడియోలు, యాడ్స్ క్లిక్ చేస్తే లక్షల్లో కమీషన్ అంటూ మోసగాళ్లు అమాయకులను ట్రాప్‌లోకి లాగుతున్నారు. ఏమాత్రం యూట్యూబ్ వీడియోలు, యాడ్స్‌పై క్లిక్ చేశారో.. తమ అకౌంట్లలో డబ్బులు ఖాళీ అవడం ఖాయం. రకరకాల సైబర్ కేటుగాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చిరిస్తున్నారు.

Tags:    

Similar News