Congress: తెలంగాణ ప్రజలకు సీడబ్ల్యూసీ ప్రత్యేక వినతి
Congress: రాష్ట్ర వనరులను అధికారంలో ఉన్నవారు దోచుకుంటున్నారు
Congress: తెలంగాణ ప్రజలకు సీడబ్ల్యూసీ ప్రత్యేక వినతి
Congress: ప్రజల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని సీడబ్ల్యూసీ సమావేశంలో గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని వర్కింగ్ కమిటీ గుర్తు చేసుకుంది. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు గడిచినా బంగారు తెలంగాణ వాగ్దానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చలేని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ప్రజలు పోరాడిన కల నెరవేరలేదన్నారు. రాష్ట్ర వనరులను అధికారంలో ఉన్నవారు దోచుకుంటున్నారని సీడబ్ల్యూసీలో లేవనెత్తారు.ధరణి పోర్టల్‌తో ఇందిరా గాంధీ నాటి భూ హక్కులను తొలగిస్తున్నారని సీడబ్ల్యూసీలో ఆరోపించారు.