వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.. వరుస సెలవులతో ఆలయానికి పోటెత్తిన భక్తులు
Vemulawada: ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.. వరుస సెలవులతో ఆలయానికి పోటెత్తిన భక్తులు
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవు కారణంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు గర్భాలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన స్వామివారికి కోడే మొక్కలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.