Coronavirus Vaccine Trails Stop in NIMS Hospital: నిమ్స్ లో నేడు జరగాల్సిన క్లినికల్‌ ట్రయల్స్‌ వాయిదా..

Coronavirus Vaccine Trails Stop in NIMS Hospital: నిమ్స్ లో నేటి నుంచి జరగాల్సిన క్లినికల్‌ ట్రయల్స్‌ వాయిదా పడ్డాయి.

Update: 2020-07-07 05:45 GMT

Coronavirus Vaccine Trails Stop in NIMS Hospital: నిమ్స్ లో నేటి నుంచి జరగాల్సిన క్లినికల్‌ ట్రయల్స్‌ వాయిదా పడ్డాయి. క్లినికల్ ట్రయల్స్ చేయడానికి ICMR అనుమతి కోసం నిమ్స్ వేచి చూస్తోంది. రెండు మూడు రోజుల్లో ICMR అనుమతి వచ్చే అవకాశం ఉంది. అనుమతులు రాగానే ఫేస్ 1, ఫేస్ 2 కింద ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగనున్నాయి. ఆగస్టు 15వ తేదీ నాటికి తయారు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) భావిస్తోంది. కరోనా వైరస్ ని అంతం చేయడానికి ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ ని కనిపెట్టే పనిలో పడ్డ విషయం తెలిసిందే. అదే విధంగా భారత దేశంలోని సైంటిస్టులు కూడా వైరస్ కు ఆంటి వ్యాక్సిన్ ని కనిపెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ఫర్మాకంపెనీలు వ్యాక్సిన్ తయారిలో చురుకుగా పనిచేస్తున్నాయి.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్(Bharat Biotech) సంస్థ కరోనాను అరికట్టేందుకు కొవాక్సిన్(Covaxin) పేరిట వ్యాక్సిన్ ని రూపొందించి. అంతే కాదు ఆ వ్యాక్సిన్‌‌ను ఆగష్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తేనుందని ఐసీఎంఆర్ ప్రకటించింది. భారత్ బయోటెక్ సంస్థ కనుగొన్న ఈ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ కోసం ఐసీఎంఆర్ ఇప్పటికే దేశంలోని 12 ఆస్పత్రులను కూడా ఎంపిక చేసుకుంది. అందులో భాగంగానే ఆయా ఆస్పత్రులకు లేఖ కూడా రాసింది. ఐసీఎంఆర్, పుణేలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి భారత్ బయోటెక్ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని ఐసీఎంఆర్ హాస్పిటళ్లను కోరింది.

భారత్ బయోటెక్ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్ కోసం ఎంపిక చేసుకున్న 12 ఆస్పత్రుల జాబితాను చూసుకుంటే హైదరాబాద్‌‌కు చెందిన నిమ్స్‌తోపాటు విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉన్నట్లు సమాచారం. వాటితో పాటు ఢిల్లీ ఎయిమ్స్, ఒడిశా‌లోని ఐఎంఎస్ అండ్ ఎస్‌యూఎం హాస్పిటల్, కర్ణాటకలోని బెలగావి జీవన్ సుఖీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రోహ్‌తక్‌లోని పండిట్ భగవత్ దయాళ్ శర్మ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, కట్టన్‌కులథూర్, నాగపూర్, బెల్గాం, కాన్పూర్, గోరఖ్‌పూర్, ఆర్యానగర్, పాట్నాల్లోని హాస్పిటళ్లలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ చేయనున్నారు. ఈ క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకన్న అనంతరం కొవాక్సిన్ అన్ని విధాలా క్షేమకరమని నిర్ధారణ అయితే అన్ని రకాల అనుమతులు వస్తే దాన్ని 2021 ఆరంభం నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.



Tags:    

Similar News