హైదరాబాద్ లో విజృంభిస్తున్న కరోనా...

తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

Update: 2020-06-01 05:30 GMT
Representational Image

తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఆదివారం తెలంగాణలో నమోదైన 199 కొత్త కేసులలో 122 కేసులు నగరంలోనే నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో మే నెలలో నమోదైన కేసులలో కేవలం హైదరాబాద్ నగరంలో 1000కిపైగా నమోదయ్యాయి. నగరంలో నమోదవుతున్న కేసులతో నగరవాసులు తీవ్ర ఆందోళను చెందుతున్నారు. అంతే కాక దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారితో కాంటాక్ట్ లో వున్న

కూరగాయల వ్యాపారి, క్యాబ్ డ్రైవర్, పోలీసు కానిస్టేబుల్.. ఇలా నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. వారు కరోనా బారిన పడడంతో నగరవాసులు రెట్టింపు ఆందోళనకు గురవుతున్నారు. అంతే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారి ద్వారా కొత్త కేసులు కూడా నమోదవుతున్నాయి.

గత 10 రోజుల్లో నగరంలోని ఎక్కువగా బాలాపూర్, అల్వాల్, సైఫాబాద్, చిలకలగూడ, మంగళ్‌హాట్ ప్రాంతాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. అంతే కాక లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత చాలా బేగంపేట, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వేరే ప్రాంతాలకు వెళ్లి రావడంతో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. వాటితో పాటుగానే ఇటీవల భోయిగుడ, నేరేడ్‌మెట్, సీతాఫల్ మండీ ప్రాంతాలు కంటెన్మెంట్ జాబితాలో చేరాయి. 35 రోజుల వరకు ఒక్క కేస్ కూడా నమోదు కానీ శేరిలింగంపల్లి సర్కిల్‌లో 8 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ కూడా లాక్‌డౌన్ ఆంక్షలను సడలించిన తరువాత గుర్తిస్తున్నారు. 


 HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News