Mahabubnagar: కోవిడ్ రోగుల పాలిట ఆశాదీపం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి

Mahabubnagar: కరోనా రోగులకు ఎలాంటి కొరత లేకుండా చికిత్స అందిస్తూ నిరుపేదలకు పెద్దదిక్కుగా మారింది మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి.

Update: 2021-06-04 11:16 GMT

Mahabubnagar: కోవిడ్ రోగుల పాలిట ఆశాదీపం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి

Mahabubnagar: కరోనా రోగులకు ఎలాంటి కొరత లేకుండా చికిత్స అందిస్తూ నిరుపేదలకు పెద్దదిక్కుగా మారింది మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి. మందులు, ఇంజెక్షన్ల నుంచి ఆక్సిజన్, వెంటిలేటర్ల వరకు అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటవటంతో ప్రజల్లో ఆస్పత్రిపై విశ్వాసం పెరిగింది. ప్రైవేట్ హాస్పిటళ్ల వైపు వెళ్లకుండా జిల్లా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి కోవిడ్‌ పేషంట్లకు భరోసా ఇస్తోంది. అన్ని రకాల సౌకర్యాలతో కరోనాకు చికిత్స అందిస్తోంది. మెడికల్ కాలేజ్‌ కూడా అందుబాటులోకి రావటంతో ఆస్పత్రిలో సిబ్బందితో పాటు వసతులు మెరుగుపడ్డాయి. ప్రస్తుతం కరోనా రోగులకు ఇక్కడ 500 బెడ్లతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అందులో 170 ఆక్సిజన్, 60 వెంటిలేటర్, 270 సాధారణ బెడ్లు ఉన్నాయి. ఆక్సిజన్‌ సహా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా రంగారెడ్డి జిల్లా నుంచి కూడా కరోనా రోగులు జనరల్ ఆస్పత్రికి వస్తున్నారు. ఫైనలియర్ పూర్తైన వైద్య విద్యార్థులను కూడా డ్యూటీలోకి తీసుకోవటంతో పర్యవేక్షణ కూడా పెరిగింది.

ఇప్పటివరకు మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో 3 వేలకు పైగా కోవిడ్ పేషంట్లకు వైద్యం అందించారు. నిత్యం 40 మంది వరకు కోవిడ్ రోగులు తీవ్రమైన సమస్యలతో ఆస్పత్రిలో చేరుతున్నారు. దీంతో ఆక్సిజన్ కొరత రాకుండా ఆక్సిజన్ ట్యాంకు ఏర్పాటు చేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు 17 ఆక్సిజన్ కాన్సంటేటర్లు అందజేశాయి. ఇక ఇక్కడికి వచ్చే రోగులకు నిత్యం ఉచిత భోజనం, ఏర్పాటు చేస్తున్నారు. ఆస్పత్రిలో అవసరమైన వారికి సీటీస్కాన్‌ను కూడా అందుబాటులో ఉంచారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆస్పత్రిలో సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. 13 కిలో లీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయించి బెడ్లు పెంచేలా కృషి చేశారు. జిల్లా వాసులు కోవిడ్ వస్తే భయపడకుండా జిల్లా ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు.

రోగుల బంధువులు కూడా ఇబ్బంది పడకుండా స్వచ్చంద సంస్ధలు వారికి ఉచిత భోజన ఏర్పాటు చేశాయి. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన తండ్రి నారాయణగౌడ్ పేరుమీద నెలకొల్పిన శాంతానారాయణగౌడ్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఆస్పత్రిలో అన్నదానం చేస్తున్నారు. ఐతే గతంలో కంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగయ్యాయని జిల్లా వాసులంటున్నారు. ఇంకా మెరుగైన వైద్యం అందించి ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News