కరోనా కేసులు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Fever Survey: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2022-01-20 09:33 GMT

కరోనా కేసులు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం 

Fever Survey: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇంటింటి ఫీవర్ సర్వే చేయాలని నిర్ణయించింది. రేపటి నుంచి ప్రతీ ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు చేస్తారని మంత్రి హరీష్‌రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి.

ఫీవర్‌ సర్వేతో జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మెడికల్‌ కిట్లను పంపిణీ చేస్తామని హరీశ్‌రావు చెప్పారు. పకడ్బందీగా సర్వే చేపట్టి కొవిడ్‌ను కట్టడి చేద్దామని అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు. ఫీవర్‌ సర్వేలో వ్యాధిలక్షణాలను గుర్తిస్తే అక్కడికక్కడే హోం ఐసోలేషన్‌ కిట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కరోనా సెకెండ్‌ వేవ్‌ సమయంలో ఫీవర్‌ సర్వే విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఆ సమయంలో తమ పనితీరును నీతి ఆయోగ్‌ ప్రశంసించిదని హరీశ్ గుర్తు చేశారు. 

Full View


Tags:    

Similar News