తెలంగాణలో రెండు వేలకు చేరువలో కరోనా కేసులు

Update: 2020-05-26 15:12 GMT
Representaional Image

తెలంగాణలో ఇవాళ కొత్తగా 71 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,991కి చేరింది. ఇవాళ ఒకరు మరణించారు. దింతో మృతి చెందిన ఒకరితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 57కి చేరింది. ప్రస్తుతం 650 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారి శాతం 60 కంటే ఎక్కువగా ఉంది.

ఈ రోజు 120 మంది డిశ్చార్జి కాగా, మొత్తంగా 1284 మంది రికవరీ అయ్యారు. మంగళవారం నమోదైన కేసుల్లో 38 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా, రంగారెడ్డి నుంచి ఏడు, మేడ్చల్‌ నుంచి ఆరు కేసులు ఉన్నాయి. వలసదారులు 12 మంది కాగా, విదేశాల నుంచి వచ్చినవారిలో నలుగురికి కరోనా ఉన్నట్లు గుర్తించారు.  




Tags:    

Similar News