Coronavirus: తాత్కాలిక షెల్టర్‌హోంలో కరోనా కలకలం..

హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలోని తాత్కాలిక షెల్టర్‌హోంలో ఉంటున్న ఓ యాచకుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో షెల్టర్ హోంలో ఒక్క సారిగా కలకలం రేగింది.

Update: 2020-04-23 05:11 GMT

హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలోని తాత్కాలిక షెల్టర్‌హోంలో ఉంటున్న ఓ యాచకుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో షెల్టర్ హోంలో ఒక్క సారిగా కలకలం రేగింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయి షెల్టర్ హోంలో ఉన్న40 మందికి పరీక్షలు నిర్వహించి, వారందరనినీ ప్రభుత్వ క్వారంటైన్‌కు పంపించారు. కాగా అసలు అతనికి కరోనా వైరస్ ఏ విధంగా పోకిందనే విషయాన్ని తెలుసుకోవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

అతనికి ఎవరైనా దాతల నుంచి కరోనా వచ్చిందా, లేదా బయట తిరిగినపుడు వచ్చిందా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాక ఆ హోంలో యాచకుడు జాయిన్ అయిన నాటినుంచి ఇప్పటి వరకు ఎవరెవరు దాతలు వచ్చారు, యాచకుడు ఎక్కడెక్కడ తిరిగి ఎవరిని కలిసాడు అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాతలెవరూ కూడా నేరుగా ఆహార పదర్థాలను, నిత్యావసర వస్తువులను పంపిణీ చేయకూడదని, అలా చేస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. దాతలు నేరుగా కాకుడా జీహఎంసీ ద్వారా దానం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇక లాక్ డౌన్ నేపథ్యంలో ఎంతో మంది నిరాశ్రయ యాచకులను అటు ప్రభుత్వం, ఇటు స్వచ్చంద సంస్థలు ఆదుకుంటున్నాయి. యాచకులందరికీ నీడ కల్పించి, మూడు పూటల భోజన వసతి కల్పిస్తున్నారు. అంతే కాక కొంత మంది దాతలు కూడా యాచకులకు ఆహార పదార్ధాలను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇటువంటి సంఘటనలు అక్కడక్కడా చోటు చేసుకుంటేనే ఉన్నాయి.  

Tags:    

Similar News