Coronavirus Graph Increasing: భారతదేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా గ్రాఫ్

Update: 2020-07-29 07:17 GMT
Corona updates in Tamil nadu

coronavirus graph increasing: భారత్‌లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలతో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 48 వేల 513 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15 లక్షల 31 వేలు దాటింది.

భారత్‌లో రోజు వారీ కరోనా కేసులు 50 వేల దాకా నమోదవుతున్నాయి. ఫలితంగా కరోనా గ్రాఫ్ దూసుకుపోతోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 48 వేల 513 మందికి కరోనా సోకింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షల31 వేలు దాటింది. అలాగే గత 24 గంటల్లో 768 మంది చనిపోవడంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 34 వేల 193కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ కేసులు 9లక్షలకు పైగా ఉన్నాయి. యాక్టివ్ కేసులు 5 లక్షల 09 వేలకు పైగా ఉన్నాయి. యాక్టివ్ కేసుల కంటే రికవరీ కేసులే ఎక్కువగా ఉండటం వల్ల దేశంలో రోజువారీ ఎన్ని కేసులు నమోదవుతున్నా కరోనా కట్టడిలో భారత్ మెరుగ్గానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కరోనా రికవరీలు, మరణాల్లో విదేశాలతో పోల్చితే భారత్ చక్కగానే ఉంది. కాకపోతే రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. సిటీలు, పట్టణాలూ దాటి పల్లెలు, సందుల్లోకి కూడా కరోనా పాకేసింది. ఐతే ఢిల్లీ లాంటి రాష్ట్రాలు రికవరీ రేటు పెంచుకుంటూ కరోనా అంతు చూస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కరోనా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఏపీలో రోజూ 7 నుంచి 8 వేల దాకా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 2.25 శాతంగా ఉంది. అలాగే రికవరీ రేటు 64.24 శాతంగా ఉంది. రోజురోజుకూ రికవరీ రేటు పెరుగుతోంది. టెస్టుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 4 లక్షల 08 వేలకు పైగా టెస్టులు చేశారు. ప్రస్తుతం మొత్తం టెస్టుల సంఖ్య కోటీ 77 లక్షలను దాటింది. ప్రస్తుతం అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక కేసులతో భారత్ మూడో స్థానంలో ఉంది. అలాగే రోజువారీ నమోదవుతున్న కేసుల్లో అమెరికా తరవాత భారత్ రెండోస్థానానికి చేరింది. మొత్తం మరణాల్లో భారత్ ఆరో స్థానంలో ఉండగా రోజువారీ మరణాల్లో మెక్సికో తర్వాత భారత్ రెండోస్థానంలో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్, అమెరికా ఉన్నాయి.

Tags:    

Similar News