Aatmanirbhar Bharat App Innovation Challenge: ఆత్మనిర్భర్‌ భారత్‌ యాప్‌ పోటీకి అనూష్య స్పంద‌న‌

Aatmanirbhar Bharat App Innovation Challenge: ఆత్మనిర్భర్‌ భారత్‌ యాప్‌ పోటీకి అనూష్య స్పంద‌న‌
x
app innovation challenge
Highlights

Aatmanirbhar Bharat App Innovation Challenge: ప్రధాని నరేంద్రమోడీ డిజిట‌ల్ వార్‌లో భాగంగా జులై 4 న భారతీయ యువతకు ఆత్మ నిర్భర భారత్‌ యాప్ ఇన్నోవేషన్‌ చాలెంజ్'ని విసిరారు

Aatmanirbhar Bharat App Innovation Challenge: ప్రధాని నరేంద్రమోడీ డిజిట‌ల్ వార్‌లో భాగంగా జులై 4 న భారతీయ యువతకు ఆత్మ నిర్భర భారత్‌ యాప్ ఇన్నోవేషన్‌ చాలెంజ్'ని విసిరారు. ఔత్స‌హికులు రూపొందించే యాప్‌లు దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాల‌నీ, ఇత‌ర దేశాల యాప్‌ల‌కు ధీటుగా ఉండాల‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు. అంతేకాదు అత్యుత్తమ యాప్‌లకు రూ.2లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నగదు బహుమతులు పొందొచ్చని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో ఈ చాలెంజ్ కు దేశవ్యాప్తంగా స్టార్టప్‌ సంస్థల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ పోటీకి మొత్తం 8 విభాగాల్లో 6940 దరఖాస్తులు వచ్చాయి. వ్యక్తిగతంగా 3,939 దరఖాస్తులు, ఆర్గనైజేషన్‌ మరియు కంపెనీలు నుంచి 3001 దరఖాస్తులు వ‌చ్చాయి. ఇక వ్యక్తిగతంగా పంపిన యాప్‌లో 1757 అప్లికేషన్లు వాడేందుకు సిద్ధంగా ఉన్నాయని.. 2182 ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ఆర్గనైజేషన్లు/కంపెనీ పంపిన యాప్‌లలో 1742 వాడేందుకు సిద్ధంగా ఉండగా.. 1259 అభివృద్ధిలో ఉన్నాయని, ఇవన్నీ ఆత్మనిర్భర్ కింద రిజిస్టర్ అయ్యాయని నీతి అయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్‌ వెల్లడించారు.

విభాగాల వారీగా ప‌రిశీలిస్తే... వ్యాపార రంగంలో 1142, ఆరోగ్య రంగంలో 901, ఈ లెర్నింగ్‌ కింద 1062, సామాజిక మాధ్యమాల విభాగంలో 1155, ఆటల విభాగంలో 326, కార్యాలయం& ఇంటి నుంచే పని విభాగంలో 662, వార్తల రంగంలో 237, వినోద రంగంలో 320 యాప్‌లు ఉన్నాయి. ఇతర విభాగాల కింద 1135 యాప్‌లు వచ్చాయి. వీటిలో 271 యాప్‌లకు లక్ష కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లు, 89 యాప్‌లకు పది లక్షలను మించి డౌన్‌లోడ్‌లు ఉన్నాయి. మారుమూల ప్రాంతాలు, చిన్న పట్టణాల నుంచి కూడా దరఖాస్తులు వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories