లోక్‌సభ లో రాఫెల్‌ రగడ.. అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ

లోక్‌సభ లో రాఫెల్‌ రగడ.. అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ
x
Highlights

రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపై శుక్రవారం లోక్‌సభలో అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. రఫేల్‌ ఒప్పంద విషయమై కేంద్ర ప్రభుత్వం...

రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపై శుక్రవారం లోక్‌సభలో అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. రఫేల్‌ ఒప్పంద విషయమై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. రాఫేల్‌ ఒప్పందంపై విపక్షాల విమర్శలకు, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ.. వివరణ ఇచ్చారు. భారత్‌ కొనుగోలు చేసిన తొలి రాఫేల్‌ యుద్ధ విమానం 2019 సెప్టెంబరు నెలలో దేశానికి వస్తుందని వెల్లడించారు. మిగిలిన విమానాలు 2022 నాటికి అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాఫేల్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని… ఈ వ్యవహారంపై ఆ పార్టీ చెప్పేవన్నీ అబద్ధాలే అని నిర్మల మండిపడ్డారు. జాతీయ భద్రతను కాంగ్రెస్‌ గాలికొదిలేసిందని… ప్రధాని పట్ల అభ్యంతరకర పదజాలం వాడారని నిప్పులు చెరిగారు.

ఎన్డీయే హయాంలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే రక్షణ శాఖ పనిచేస్తోంది. కానీ యూపీయే నాటి బోఫోర్స్, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణాల్ని ప్రస్తావించారు. బోఫోర్స్‌తో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయిందని, కానీ రఫేల్‌తో మోదీ మళ్లీ ప్రధాని అవుతారని ఆమె అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు మల్లికార్జున ఖర్గే రఫెల్ పై మాట్లాడుతూ.. 'రఫేల్‌ ఒప్పందంలో రూ.1.30 లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. ప్రధాని మోదీ తన సన్నిహితుడికి ఆఫ్‌సెట్‌ కాంట్రాక్టును కట్టబెట్టారని, ఈ మొత్తం వ్యవహారంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఓ వైపు రఫెల్ విషయంలో రక్షణ మంత్రి వివరణ ఇస్తుండగానే.. మరోవైపు విపక్షాల ఆందోళనతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితి కనిపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories